జనం సాక్షి దుబ్బాక.సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం లోని18 సంవత్సరాల వయసు నిండి డ్రైవింగ్ లైసెన్స్ లేనటువంటి వారందరికీ ఇదొక సువర్ణ అవకాశం మీ ఆధార్ కార్డు, రెండు ఫోటోలు, బర్త్ సర్టిఫికెట్ లేదా టెన్త్ క్లాస్ మెమో వీటితో ఒక దరఖాస్తు రాసి తేదీ 29 జూన్ 2023 నుండి 5 జూలై 2023 సాయంత్రం 5 గంటలలోపు దుబ్బాక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీ దరఖాస్తును సమర్పించగలరు.లైసెన్స్ ఫీజు మొత్తం నా కార్యాలయం నుంచి చెల్లించి మీకందరికీ ఉచితంగా సిద్దిపేట ఆర్టీవో కార్యాలయం నుండి లైసెన్సులు ఇప్పించబడును.ఈ అవకాశాన్ని దుబ్బాక నియోజకవర్గం లోని యువతి యువకులందరూ సద్వినియోపరుచుకోగలరని సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను. 
దుబ్బాక నియోజకవర్గ ప్రజలందరికీ ఎమ్మెల్యే రఘునందన్ రావు




