Tuesday, 3 November 2026

మాజీ హోంమంత్రి నాయిని నర్సింహ రెడ్డి మృతి

హైదరాబాద్‌ : మాజీ హోంమంత్రి నాయిని నర్సింహ రెడ్డి (80) కన్నుమూసారు. జూబ్లీహిల్స్‌ అపోలో హాస్పిటల్‌లో గత కొద్ది రోజులుగా చికిత్స తీసుకుంటూ నాయిని మృతి చెందారు. గత నెలలో నాయిని నర్సింహారెడ్డి కరోనా వైరస్ బారినపడి కోలుకున్నారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన తర్వాత శ్వాస సంబంధ సమస్యలకు గురయ్యారు. వైద్య పరీక్షల్లో న్యూమోనియా అని తేలింది. కరోనా కారణంగా కలిగిన న్యూమోనియాతో ఊపిరితిత్తులు దెబ్బతిన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే నాయిని ఆసుపత్రి పాలు అయ్యారు. ఆయన ఆరోగ్యంగా కోలుకుని తిరిగి వస్తారనే ప్రజలు అనుకున్నారు. కానీ దురదృష్టవశాత్తు ఆయన మరణ వార్త ఆయన అభిమానులను, పార్టీ శ్రేణులను తీవ్ర భాదలోకి నెట్టివేసింది.

నాయిని నర్సింహా రెడ్డి 1944 లో నల్గొండ జిల్లాలోని నేరేడుగోమ్ము గ్రామంలో జన్మించారు. ఆయనకు భార్య అహల్య, కొడుకు దేవేందర్‌ రెడ్డి, కుమార్తె సమతా రెడ్డి ఉన్నారు.