Thursday, 5 November 2026

మాటల గారడితో ప్రజలను మోసగిస్తున్న

మాటల గారడితో ప్రజలను మోసగిస్తున్న కేసీఆర్…ధర్మం కోసం పనిచేసే పార్టీలో చేరుతా.. వట్టిపల్లి శ్రీనివాస్ గౌడ్

రాజాపేట, డిసెంబర్5 ( జనం సాక్షి): మాటల గారడితో కెసిఆర్ ప్రజలను మభ్యపెట్టి మోసం చేస్తున్నారని, అవినీతి పాలన అంతమందించడానికి ప్రజల సహకారంతో దేశంలో ధర్మం కోసం న్యాయం కోసం పనిచేసే పార్టీలో చేరబోతున్నానని టిఆర్ఎస్ మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజపేట మాజీ ఎంపీపీ వట్టిపల్లి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. సోమవారం మండలంలోని వి ఎస్ జి ఫంక్షన్ హాలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమించిన ఉద్యమకారులు నేడు కనుమరుగైపోయారని ఆరోపించారు. సీఎం కేసీఆర్ ఎనిమిదేళ్ల పాలనలో నిధులు నీళ్లు నియామకాలను విస్మరించారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటికో ఉద్యోగం మూడెకరాల భూమి ఇస్తామని సీఎం కేసీఆర్ అధికారం చేపట్టి హామీలన్నీ తుంగల తొక్కారన్నారు. రాష్ట్రంలో పూర్తిగా అసమర్థత పాలన కొనసాగుతుందని టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎంపీలు భూమాఫియాలుగా మారి కోట్లకు పడగలెత్తారని ఆరోపించారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు ప్రజా సంక్షేమాన్ని విమర్శిస్తున్న గులాబీ పార్టీకి రాబోయే ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని అన్నారు సీఎం కేసీఆర్ రాష్ట్రంలో అభివృద్ధిని విస్మరించి మాటల గారడితో ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు తెలంగాణ ప్రజలు కేసీఆర్ గారడి మాటలు నమ్మే పరిస్థితి ఇప్పుడు లేరన్నారు రైతన్నలు కాలు అడ్డు పెడితే సాగునీరు అందుతాయని మోసం మాటలు చెప్పిన ఘనుడు సీఎం కేసీఆర్ అని అన్నారు నేడు తెలంగాణ రాష్ట్రం సాగునీరు లేక ఎడారిగా మారి ఆత్మహత్యల తెలంగాణగా మారిందని ఆరోపించారు రెండు మూడు రోజుల్లో ఏ పార్టీలో చేరబోయే కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు నాతో తెలంగాణ ఉద్యమంలో కాలు కదిపిన ప్రతి ఒక్కరు సహకార అందించాలని విజ్ఞప్తి చేశారు.