Thursday, 5 November 2026

కాంతయ్య కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం

కాంతయ్య కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం అందజేత హుజూర్ నగర్ డిసెంబర్ 5 (జనంసాక్షి): హుజూర్ నగర్ పట్టణంలోని 14వ వార్డులో గత 10 రోజుల క్రితం మరణించిన కోల్లపూడి కాంతయ్య సతీమణి లలితమ్మ పెద్దదిన కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు పాల్గొని సోమవారం పరామర్శించారు. అనంతరం వారి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ తరఫున, వార్డు కౌన్సిలర్ తరఫున ఆర్థిక సహాయం అందించి వారి చిత్రపటానికి పూలమాలేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో హుజూర్ నగర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు తన్నీరు మల్లికార్జున్, 14వ వార్డు కౌన్సిలర్ ఇందిరాల త్రివేణివెంకటేష్, వార్డు బూత్ అధ్యక్షులు కోల్లపూడి యోహాన్, కోల్లపూడి ఏసురత్నం, కోల్లపూడి డేవిడ్, లక్ష్మల్ల నాగేశ్వరరావు, ఇట్టిమల్ల బెంజిమెన్, కంకణాల పుల్లయ్య, కోల్లపూడి షడ్రక్, కోల్లపూడి కమలాకర్, రత్నకుమారి, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.