Wednesday, 4 November 2026

మాదిగ జేఏసీ మంథని డివిజన్ అధ్యక్షులుగా బూడిద శంకర్

జనంసాక్షి, మంథని : పెద్దపల్లి జిల్లా మంథని కాలేజీ గ్రౌండ్ లో మాదిగ జేఏసీ జిల్లా అధ్యక్షులు అక్కపాక సంపత్ కుమార్ అధ్యక్షతన ముఖ్యనాయకుల సమావేశం నిర్వహించగా ఈ సమావేశంలో నాగారం గ్రామానికి చెందిన బూడిద శంకర్ ని మాదిగ జేఏసీ వ్యవస్థాపకులు డా.పిడమర్ధి రవి ఆదేశాల మేరకు బూడిద శంకర్ ని ఎన్నిక చేయడం జరిగిందని అక్కపాక సంపత్ కుమార్ తెలిపారు. బూడిద శంకర్ మాట్లాడుతూ.. తన నియామకానికి సహకరించిన మాదిగ జేఏసీ వ్యవస్థాపకులు డా.పిడమర్తి రవి కి, పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు అక్కపాక సంపత్ కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బూడిద రాజయ్య, ముత్యాల లింగయ్య,కర్ణ కృష్ణ, బూడిద రాజు,మంథని రాకేష్,నక్క శేఖర్,రాజేశ్వర్ రావు,అక్కపాక సదానందం, నాయకులు పాల్గొన్నారు.