
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కె.సుధాకర్ లాల్…
నాగర్ కర్నూల్ ఆర్సీ జూలై 6(జనంసాక్షి):సీజనల్,వర్షాకాలంలో ప్రభలే వ్యాధులు నివారణకు రాష్ట్ర ఆరోగ్య శాఖ ఆదేశానుసారం నాగర్ కర్నూల్ జిల్లాలో వైద్య ఆరోగ్య క్షేత్రస్థాయి సిబ్బంది,ఆరోగ్య కార్యకర్తలు,ఆశా కార్యకర్తలు ప్రతి శుక్రవారం-పొడి దినం(డ్రైడే)కార్యక్రమాన్ని తప్పనిసరిగా నిర్వహించి,నివేదికలు సమర్పించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కె.సుధాకర్ లాల్ సూచించారు.ప్రస్తుత వర్షాకాలంలో సోకే దోమకాటు వ్యాధులు మలేరియా,డెంగ్యూ,చికన్ గునియా,కలుషిత నీటి వల్ల సోకే జ్వరాలు టైఫాయిడ్,కామెర్లు,నివారణకు క్షేత్రస్థాయిలోని ఆరోగ్య కార్యకర్తలు,ఆశా కార్యకర్తలు సంయుక్తంగా డ్రైడే కార్యక్రమాన్ని ఇంటింటా నిర్వహించి,దోమకాటు,కలుషిత నీటి వల్ల ప్రభలే వ్యాధులు వ్యాధులను నివారించాలని,ప్రజా ఆరోగ్యాన్ని కాపాడాలని ఆయన సూచించారు.పొడి దినం కార్యక్రమంలో దోమల గుడ్లు,లార్వా,ప్యుపా నివారణలో భాగంగా టేమిఫస్ ను ఉపయోగించి,లార్వా స్థాయిలోనే దోమల నియంత్రణ చేయాలని కోరారు.దోమకాటు వ్యాధులు మలేరియా,డెంగ్యూ,చికన్ గునియా,బోదకాలు,మెదడు వాపు రోగాలపై ఇంటింటా ఆరోగ్య సిబ్బంది తిరుగుతూ,వ్యాధులపై ప్రజా ఆరోగ్యాన్ని అవగాహన కల్పించాలని సూచించారు.ఓ.అర్.ఎస్. తయారీ విధానాన్ని అవగాహన కల్పించాలన్నారు.ప్రజా ఆరోగ్య కార్యక్రమాల పట్ల ఆరోగ్య సిబ్బంది నిర్లక్ష్యం వహించరాదనీ అన్నారు.పొడి దినం కార్యక్రమాన్ని ఆరోగ్య పర్యవేక్షకులు,సబ్ యూనిట్ ఆఫీసర్స్,ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు పర్యవేక్షించాలని సూచించారు.




