ఆర్మూర్ నుంచి నమస్తే తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి :తమది పేదలకోసం పనిచేసే ప్రభుత్వమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. పేదల సంక్షేమానికి రూ.40వేల కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం దేశంలో ఒక్క తెలంగాణయేనని ఆయన చెప్పారు. అనేక రాష్ర్టాలు కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ఆదర్శంగా తీసుకుంటున్నాయన్నారు. పెన్షన్లు మొదలుకొని సన్నబియ్యం, కల్యాణలక్ష్మి వరకు పేదలకు అండగా నిలిచిన సీఎం కేసీఆర్, ఇప్పుడు అమ్మఒడి పథకం కింద గర్భిణులకు రూ.12వేలతో పాటు పుట్టిన పిల్లలకు కిట్ కూడా అందజేస్తున్నారని తెలిపారు. తెలంగాణ రాకముందు విషప్రచారాలు చేశారని, గత 33 నెలల కాలంలో వాటిని పటాపంచలు చేశామని చెప్పారు. 70 ఏండ్ల స్వాతంత్య్రంలో అధిక సమయం పాలించిన కాంగ్రెస్ నేతలు ఇంతకాలం గుడ్డిగుర్రాలకు పండ్లుతోమి, ఇపుడు 33 నెలల ప్రభుత్వం మీద అవాకులు, చెవాకులు పేలుతున్నారని ధ్వజమెత్తారు. ప్రాజెక్టుల మీద కేసులు పెట్టి అడుగడుగునా అభివృద్ధిని అడ్డుకుంటున్నారన్నారు. అమరావతి బానిసలు, ఢిల్లీ పాదసేవకులను తోసిపుచ్చి మనకోసం పనిచేసే మన పార్టీనే ఆదరించాలని ఆయన పిలుపునిచ్చారు. గురువారం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన కేటీఆర్, మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన తెలంగాణ జనహిత ప్రగతి సభలో ప్రసంగించారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు రూ.100కోట్లు, ఐదు మున్సిపాలిటీలకు రూ.50కోట్ల చొప్పున ఇస్తామని ఈ సందర్భంగా ప్రకటించారు. ఆయన ప్రసంగం ఆయన మాటల్లోనే..




