హైదరాబాద్: నీటిపారుదల ప్రాజెక్టులపై సీఎం కేసీఆర్ విస్తృత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఆయనతో పాటు హరీష్ రావు, ఈటెల రాజెందర్, వేముల ప్రశాంత్ రెడ్డి కూడా హాజరయ్యారు. కాళేశ్వరం, శ్రీరామదాసు, పాలమూరు ప్రాజెక్టుల నిర్మాణంపై సమీక్ష జరిపారు. నాగార్జునసాగర్, కాకతీయ కాల్వల పనుల పురోగతి తెలుసుకున్నారు. ఈ ఏడాది వర్షాలు బాగా పడతాయని వాతావరణ శాస్త్రజ్ఞులు చెబుతున్నారని ఆయన అన్నారు. ఈ నీళ్లను వీలైనంత ఎక్కువగా పొలాలకు అందించాలని ఆయన అన్నారు. ప్రాజెక్టుల నిర్మాణం ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యతాంశమని ఆయన అన్నారు. ప్రతీ నెలా నీటి పారుదల శాఖకు ఖచ్చితంగా చెల్లింపులు చేస్తామన్నారు. నిధుల కొరత లేకుండా చేస్తామని తెలిపారు. పనుల్లో వేగం పెంచాలని అధికారులకు సూచించారు. గోదావరిలో 954 టిఎంసిల నీటి కేటాయింపు ఉన్నప్పటికీ ప్రాజెక్టులు లేకపోవడం వల్ల వాడలేకపోతున్నామన్నారు. మేడిగడ్డ బ్యారేజి పనులతో పాటు ఇతర పనులు సమాంతరంగా సాగాలని ఆయన అన్నారు. బ్యారేజి నిర్మాణానికి ముందే మేడిగడ్డ నుంచి నీటిని తోడాలని అన్నారు. 2018 మార్చి నాటికి ఈ పనులు పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు. మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి వరకు, ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరుకు.. మిడ్ మానేరు నుంచి మల్లన్న సాగర్ వరకు నీరు అందించాలని ఆయన అన్నారు. వరద కాలువ ద్వారా ఎస్ఆర్ఎస్‌పి కాలువలోకి నీళ్లు మళ్లించాలని అధికారులకు తెలిపారు.ప్రాజెక్టులను శరవేగంగా పూర్తి చేయండి
హైదరాబాద్: నీటిపారుదల ప్రాజెక్టులపై సీఎం కేసీఆర్ విస్తృత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఆయనతో పాటు హరీష్ రావు, ఈటెల రాజెందర్, వేముల ప్రశాంత్ రెడ్డి కూడా హాజరయ్యారు. కాళేశ్వరం, శ్రీరామదాసు, పాలమూరు ప్రాజెక్టుల నిర్మాణంపై సమీక్ష జరిపారు. నాగార్జునసాగర్, కాకతీయ కాల్వల పనుల పురోగతి తెలుసుకున్నారు. ఈ ఏడాది వర్షాలు బాగా పడతాయని వాతావరణ శాస్త్రజ్ఞులు చెబుతున్నారని ఆయన అన్నారు. ఈ నీళ్లను వీలైనంత ఎక్కువగా పొలాలకు అందించాలని ఆయన అన్నారు. ప్రాజెక్టుల నిర్మాణం ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యతాంశమని ఆయన అన్నారు. ప్రతీ నెలా నీటి పారుదల శాఖకు ఖచ్చితంగా చెల్లింపులు చేస్తామన్నారు. నిధుల కొరత లేకుండా చేస్తామని తెలిపారు. పనుల్లో వేగం పెంచాలని అధికారులకు సూచించారు. గోదావరిలో 954 టిఎంసిల నీటి కేటాయింపు ఉన్నప్పటికీ ప్రాజెక్టులు లేకపోవడం వల్ల వాడలేకపోతున్నామన్నారు. మేడిగడ్డ బ్యారేజి పనులతో పాటు ఇతర పనులు సమాంతరంగా సాగాలని ఆయన అన్నారు. బ్యారేజి నిర్మాణానికి ముందే మేడిగడ్డ నుంచి నీటిని తోడాలని అన్నారు. 2018 మార్చి నాటికి ఈ పనులు పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు. మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి వరకు, ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరుకు.. మిడ్ మానేరు నుంచి మల్లన్న సాగర్ వరకు నీరు అందించాలని ఆయన అన్నారు. వరద కాలువ ద్వారా ఎస్ఆర్ఎస్‌పి కాలువలోకి నీళ్లు మళ్లించాలని అధికారులకు తెలిపారు.



