మానవత్వం చాటిన జడ్పీ చైర్మన్ పుట్ట మధు

జనంసాక్షి, మంథని : ఆపదలో ఉన్నామంటే ఆదుకుంటాడనే భరోసా కల్పించే నాయకుడే మంథని భిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్‌. నియోజక వర్గంలోని అనేక నిరుపేద కుటుంబాలకు అండగా నిలుస్తూ ఎన్నో విధాలుగా సాయం అందించిన జడ్పీ చైర్మన్, మంథని భీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్‌ తాజాగా ఓ నిరుపేదకు సొంత ఖర్చులతో కృత్రిమ కాలు పెట్టించారు. మంథని మండలం ఉపట్ల గ్రామానికి చెందిన కాసిపేట వెంకటస్వామి ప్రమాదవ శాత్తు మడిమ వరకు కాలు కోల్పోయాడు. ఆర్థిక స్థోమత లేని వెంకటస్వామి సాయం చేయాలంటూ మంథని భీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్‌ ను కలిశారు. వెంటనే స్పందించిన ఆయన హైదరాబాద్‌కు తీసుకెళ్లి ఆస్పత్రిలో చూపించారు. వెంకటస్వామి నడవలేని పరిస్థితి ఉండటంతో కృత్రిమ కాలు ఏర్పాటుకు ప్రయత్నం చేశారు. గత పదిహేను రోజుల క్రితం హైదరాబాద్‌లోని సంగమేశ్వర హెల్త్‌ అండ్‌ సర్జికల్‌ ఏజేన్సీని సంప్రదించి వెంకటస్వామి పరిస్థితిని వివరించారు. వెంటనే నర్సయ్యను పరీక్షించి కృత్రిమ కాలు తయారు చేసి అందజేశారు. ఆనాడు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నియోజకవర్గంలోని అనేక మంది వికలాంగులకు కృత్రిమకాలు పెట్టించి వారంతా నడిచే విధంగా సాయం అందించిన మానవత్వం చాటుకున్నారు. మరోసారి వెంకటస్వామి కి కృత్రిమకాలు పెట్టించి మనస్సున్నమారాజుగా పేరు తెచ్చుకున్నారు. నడవలేని పరిస్థితుల్లో ఉన్న తనకు చేయూతనిస్తూ సొంత కాళ్లపై నడిచే విధంగా కృత్రిమ కాలు పెట్టించిన మంథని భీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్‌కు వెంకటస్వామి కృతజ్ఞతలు తెలిపారు.