మానవ హక్కుల సంరక్షణనే.. సామాజిక బాధ్యత.. ఏసీపీ వెంకటేశ్వర్లు.. నిజామాబాద్ రూరల్ డిసెంబర్ 10 ( జనంసాక్షి ) : అంతర్జాతీయ మానవ హక్కుల సంరక్షణనే ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అన్నారు ఏసీపీ వెంకటేశ్వర్లు.శనివారం అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా ఎస్ ఎస్ ఆర్ డిగ్రీ కళాశాల, ఎఫ్ ఎన్ ఎన్ యూనిట్ ఒకటి రెండోవ ఆధ్వర్యంలో విద్యార్థులకు మానవ హక్కులకు సంబంధించి అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నగర అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ వెంకటేశ్వర్లు, జిల్లా న్యాయ సలహా సంఘం అధ్యక్షులు మాణిక్ రాజు , నగర వన్ టౌన్ ఎస్ఐ విజయ్ హాజరై ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి ఎస్ఎస్ఆర్ విద్యాసంస్థల చైర్మన్ మారయ్య గౌడ్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వక్తలు విద్యార్థులకు మానవ హక్కుల గురించి తెలియజేయడం జరిగింది విద్యార్థుల మానవ హక్కుల సంరక్షణ తమ సామాజిక బాధ్యతగా భావించాలని దిశ నిర్దిష్టను చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల విద్యార్థులు అధ్యాపకులు తదితరులు పాల్లోన్నారు..
మానవ హక్కుల సంరక్షణనే.. సామాజిక బాధ్యత




