Thursday, 5 November 2026

మానవ హక్కుల దినోత్సవాన్ని పురస్కరిం చుకొని పండ్లు పంపిణీ.

మానవ హక్కుల దినోత్సవాన్ని పురస్కరిం చుకొని పండ్లు పంపిణీ.
ఇంటర్నేషనల్ ఉమెన్ రైట్స్ ఆర్గనైజేషన్ తాండూర్ నియోజకవర్గ అధ్యక్షులు అరవింద్ కుమార్.
తాండూరు డిసెంబర్ 10(జనంసాక్షి) అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవ సందర్భంగా తాండూర్ పట్టణంలోఇంటర్నేషనల్ ఉమెన్ రైట్స్ ఆర్గనైజేషన్ తాండూర్ నియోజక వర్గం అధ్యక్షులు అరవింద్ కుమార్ ఆధ్వర్యం లో బస్టాండ్ సమీపంలో ని డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల సమర్పించారు. అనం తరం తాండూర్ జిల్లా ఆస్పత్రి మాత సుశు కేంద్రంలో రోగులకు బిస్కెట్లు ,బ్రెడ్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంలో ఆస్పత్రిలోని అన్ని విభాగాలను పరిశీలించి రోగులకు అందుతున్న వైద్య సేవలు సౌకర్యాలు తదితర విషయాలపై
వైద్యులకుఅడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో మెరుగైన సేవలు అందించేందుకు మరింత సౌకర్యాలను కల్పించవలసిన అవసరం ఉందని అధికారులకు విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా ఆస్పత్రి ముందు కార్యకర్తలతో మానవ హక్కులు వాటి సాధన పై అవగాహన కల్పించేందుకు సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ ఉమెన్ రైట్స్ వికారాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు శివశంకర్, బిజెపి బంజారా విభాగం ముఖ్యులు భాను ప్రసాద్, ప్రశాంత్, చంద్రశేఖర్ ,అడ్వకేట్ జిలాని, తిమ్మాయిపల్లి నరసింహులు, ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.