Tuesday, 3 November 2026

మార్కాపురాన్ని జిల్లా చేయాలి

మంత్రిని కోరిన సాధనసమితి నేతలు
ఒంఓగుల,ఫిబ్రవరి26(జనం సాక్షి): ఎపి దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ ప్రకాశం జిల్లా మార్కాపురంలో జిల్లాల పునర్విభజన సెగ తగిలింది. మార్కాపురం జిల్లా సాధన సమితి నేతలు వెల్లంపల్లి కాన్వారును అడ్డుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే నాగార్జునరెడ్డితో కలిసి వెళ్తున్న మంత్రి వాహన శ్రేణిని ఆందోళనకారులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులు వారిని పక్కకు లాగారు. దీక్షా శిబిరాన్ని గమనించి కారు ఆపిన మంత్రి వెల్లంపల్లి జిల్లా సాధన సమితి నేతలతో మాట్లాడారు. 18 రోజులుగా ఉద్యమం చేస్తున్నా స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదని.. మార్కాపురం జిల్లా ఏర్పాటుకు విూరైనా సహకరించాలని వెల్లంపల్లికి వినతీపత్రం అందించారు.