మార్కెట్ కమిటీ పాలకవర్గ సభ్యులను సన్మానించిన…. ది గ్రీన్ అండ్ సీడ్స్ అసోసియేషన్ సభ్యులు.

తాండూరు అక్టోబర్ 7(జనంసాక్షి) మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ సభ్యులను ది గ్రీన్ అండ్ సీడ్స్ మార్చండి అసోసియేషన్ సభ్యులు ఘనంగా శాలువా పూలమాలతో సన్మానించారు .శనివారం తాండూరు పట్టణం ది గ్రీన్ అండ్ సీడ్స్ మార్కెట్ అసోసియేషన్ కార్యాలయంలో మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా
మార్కెట్ కమిటీ నూతనంగా నియమించిన అధ్యక్షులు గద్ది వీణ శ్రీనివాస్ చారి వైస్ చైర్మన్ ఉమా శంకర్ తోపాటు డైరెక్టర్లను ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా ది గ్రీన్ అండ్ సీడ్స్ మర్చంట్ అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ నూతనంగా నియమితులైనా వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం శుభాకాంక్షలు తెలిపారు. మార్కెట్ కమిటీ ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలని
అన్నారు. జిల్లాలోని తాండూర్ మార్కెట్ కమిటీకి గుర్తింపు తేవాలని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ది గ్రీన్ అండ్ సీడ్స్ మార్చండి అసోసియేషన్ అధ్యక్షులు కార్యదర్శులు మరియు హమాలీ యూనియన్ సభ్యులు గుమాస్తాలు తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.