Tuesday, 3 November 2026

మార్చి 11 నుంచి రెవెన్యూ సదస్సులు

హైదరాబాద్‌: రాష్ట్రంలో రెవెన్యూ సదస్సులను మార్చి 11వ తేదీ నుంచి ఎప్రీల్‌ 30వ తేదీ వరకూ నిర్వహించాలని రాష్ట్ర రెవెన్యూ మంత్రి ఎన్‌. రఘువీరారెడ్డి ఆదేశించారు. భూ పరిపాలన శాఖ ప్రధాన కమిషనర్‌  పి.కె మహంతి, రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి బీఆర్‌ మీనా ,ఆ శాత  ఇతర అధికారులతో మంత్రి సమావేశమై వివిధ అంశాలను సమీక్షించారు. రెవెన్యూ ప్రాంతీయ సదస్సులను ఈ నెల 22న తిరుపతిలో, 26న విజయవాడ, 27న హైదరాబాద్‌లో నిర్వహించడానికి ఏర్పాట్లు చేయాలని తెలిపారు. మీ సేవలో మరో 12 రెవెన్యూ సేవలను అందజేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *