Tuesday, 3 November 2026

మార్చ్‌ను శాంతియుతంగా నిర్వహించాలి: బొత్స

విశాఖపట్నం: తెలంగాణ ప్రజలు ‘ మార్చ్‌’ ను శాంతియుతంగా నిర్వహించాలని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కోరారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కల్లించొద్దని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ సమస్యకు త్వరలోనే శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. మంత్రుల ఒత్తిడితో మార్చ్‌కు అనుమతివ్వలేదని, అన్ని సమస్యలను పరిశీలించి అనుమతిచ్చిందని  తెలియజేశారు. అన్ని ప్రాంతాల ప్రజలు సంయమనం పాటించాలని ఆయన కోరారు. రాజకీయ లబ్ధి కోసమే చంద్రబాబు లేఖ ఇచ్చారని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *