మిర్యాలగూడ, జనం సాక్షి.సమాజ మార్పు అందరితో కలిసి పనిచేసి మమేకం అయ్యే మహా మనిషి మారం శ్రీనివాస్ అనిఎస్సీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఉమ్మడి నల్గొండ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మాడ్గుల శ్రీనివాస్,మిర్యాలగూడ డివిజన్ ప్రధాన కార్యదర్శి బాబురావు,డాక్టర్ జాడి రాజు, బంజారా ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు మాలోత్ దశరత్ నాయక్ లు అన్నారు. శనివారం స్థానిక ఎస్సీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో స్థానిక కార్యాలయంలో మారం శ్రీనివాస్ కు ఏర్పాటు చేసిన సన్మానం, అభినందన కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగిగా విద్యుత్ వినియోగదారులకు అందుబాటులో ఉంటూ భాద్యతలు నిర్వహిస్తూనే కొద్దిపాటి సమయంలో నాన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో సామజిక సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమన్నారు. సమాజిక వైతాళికుడిగా సమాజంలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేసే మహా వ్యక్తిగా కొనియాడారు. సామాజిక స్పృహ ఉన్న మారం శ్రీనివాస్ భవిష్యత్తులో మరెన్నో అవార్డ్స్ స్వీకరించాలని, సేవా కార్యక్రమాలను కొనసాగించాలని ఆకాంక్షించారు. అనంతరం శాలువాలు, పూల దండాలు, మెమోంటోలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో రిటైర్డ్ ఉద్యోగి పీడీ అడ్విన్,రిటైర్డ్ ఎమ్మార్వో దైద నాగయ్య, దాసరాజు జయరాజు, నల్లగంతుల నాగభూషణం,, అక్కి మోహన్, చిన్న పంగు గోపయ్య, సూపరిండెంట్ మట్టయ్య, కె.వి.పి.ఎస్ మల్లయ్య,బూర్గు వెంకులు, గోలి కృష్ణ,సంఘం నాయకులు బూర్గు జ్ఞాన ప్రకాష్,మడుపు సైదులు, గుడిపాటి శ్రీరాములు, చింతపల్లి లచ్చయ్య, దైద వెంకటరత్నం, తాళ్లపల్లి వినయ్, కుమార్ లయన్, పెరపాక కృష్ణ, అన్నేపాక బిక్షం, పేరం దివాకర్, మేక చంద్రశేఖర్, పేరం దాసు తదితరులు పాల్గొన్నారు.




