వేములవాడ మే 06 (జనంసాక్షి)నంది కమాన్ కూడలి ప్రవేశ ద్వారంను ఆధ్యాత్మికత ఉట్టిపడేలా సుందరంగా తీర్చిదిద్దాలి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు,నంది కమాన్ కూడలి ప్రవేశ ద్వారాన్ని ఆధ్యాత్మికత ఉట్టిపడేలా, సుందరంగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మున్సిపల్ అధికారులను ఆదేశించారు.శనివారం ఆయన వేములవాడ పట్టణంలోని పలు అభివృద్ధి పనులను పరిశీలించారు.
వేములవాడ పట్టణంలోని మూల వాగుబండ్ అభివృద్ధి పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ పట్టణ ప్రజలకు సరికొత్త అనుభూతినిచ్చెలా, పిల్లలు పెద్దలు ఉదయం,సాయంత్రం వేళల్లో అహ్లాదవాతావరణంలో సేదదీరేలా బండ్ ను అభివృద్ధి చేయాలన్నారు.
ఇప్పటికే సింహభాగం పనులు పూర్తి అయినందున పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.
అనంతరం జిల్లా కలెక్టర్ మల్లారం రోడ్డు మార్గంలో రోడ్డుకు ఇరువైపులా నిర్మిస్తున్న వాకింగ్ ట్రాక్ నిర్మాణ పనులను పరిశీలించారు. జూన్ రెండు లోగా పూర్తి చేయాలన్నారు.
సందర్శనలో జిల్లా కలెక్టర్ వెంట మున్సిపల్ కమిషనర్ అన్వేష్, మున్సిపల్ ఏ ఈ నర్సిoహా తదితరులు ఉన్నారు.




