కాంగ్రెస్, బీఅర్ఎస్ రెండూ ఒక్కటే
బీజేపీ జిల్లా నాయకులు నూకల కృష్ణ యాదవ్
జనం సాక్షి, చెన్నరావు పేట
మండల కేంద్రము లో జరిగిన బీజేపీ సమావేశంలో నూకల కృష్ణ యాదవ్ మాట్లాడుతూ గత రెండు రోజుల నుంచి అధికార పార్టీ బీఅర్ఎస్ నాయకులు అటు కాంగ్రెస్ నాయకులు మేం అంటే మేం అభివృద్ధి చేశాం అని హాడవిడిగా ఉపన్యాసాలు ఇచ్చుకుంటున్నారు తప్ప ప్రజలకు విళ్ళ వాళ్ళ ఒరిగింది ఏమి లేదనీ, 2014 ఎన్నికల్లో తప్పుడు వాగ్దానాలు ఇచ్చి అధికారం లోకి వచ్చిన టీఆర్ఎస్ వాటిని నెరవేర్చకుండా గాలి మాటలు మాట్లాడుతున్నారు, ఇప్పుడు ఉన్న సమయంలో బీఅర్ఎస్ కార్యకర్తలు నాయకులే ఎమ్మెల్యేను , ముఖ్యమంత్రిని నమ్మే పరిస్థితి లేక ఆత్మీయ సమ్మేళనం పేరుతో మళ్లీ బురడి కొట్టించాలని చూస్తున్నారు. ప్రజలు ఏ ఎన్నిక వచ్చిన రాష్ట్రంలో బీజేపీకి బ్రహ్మరథం పడుతున్నారు. నియోజకవర్గం లో బీఅర్ఎస్ ప్రభుత్వం వేసే రోడ్లు చాలా నాసిరకంగా వేసి విపరీతమైన కమీషన్లకు పాల్పడుతున్నారు.నిరుద్యోగులకు ఆశ చూపి నోటిిఫికేషన్ లు వేసి పేపర్స్అమ్ముకుంటున్నారు. రైతులకు రుణ మాఫీ లేదు,పేదలకు ఇళ్ల నిర్మాణం లేదు, యాదవులకు గొర్రెలు లేవు, దళిత బందు లేదు, ఏ వర్గాల ప్రజల కూడా ఈ రోజు బీఅర్ఎస్ పార్టీనీ నమ్మే పరిస్థితి లేదు, ఎప్పుడు ఎన్నికల వస్తాయా అని ప్రజలే ఎదురు చూస్తున్నారు బీఅర్ఎస్ పార్టీనీ చిత్తు చిత్తుగా ఒడియడానికి.మన నియోజకవర్గం లో మాధవ రెడ్డి పుణ్యాన కాంగ్రెస్ పార్టీ కొద్దిగా బతికి ఉన్న ఇటు రాష్ట్రం లో అటు దేశంలో ఆ పార్టీ చేసిన అవినీతికి ప్రతి రాష్ట్రం లో డిపాజిట్లు గల్లంతు అవుతున్నాయి. ఇంకా ఇరవై ఏళ్ల ఐనా ఆ పార్టీ లేవదు, దాని గురించి చర్చే లేదు. కాబట్టి ప్రజా సమస్యల పై , దేశం కోసం నిరంతాయంగా పోరాడే బీజేపీని రాష్ట్రం లో దేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పారదర్శకమైన పాలన అందిస్తున్న భారతియ జనతా పార్టీని అక్కున చేర్చుకుంటున్నారు ప్రజలు.మన రాష్ట్రంలో మన నర్సంపేట నియోజకవర్గం లో భారతీయ జనతా పార్టీ విజయ దుందుభి మోగిస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో బీజేపి నాయకులు అనిల్ నాయక్, తల్లపెళ్ళి రమేశ్, హంస రామ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
మార్పు కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు.మార్పు కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు.




