*
అలంపూర్ జనంసాక్షి (ఏప్రిల్ 3)అలంపూర్ నియోజకవర్గం బహుజన సమాజ్ పార్టీ నియోజకవర్గం కోశాధికారి గా నాగేశ్వర్ రెడ్డి నియమితులు అయ్యారు. సోమవారం అలంపూర్ చౌరస్తా లో పార్టీ కార్యాలయం లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. సందర్బంగా
జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షులు ఎం సి కేశవరావు ఆధ్వర్యంలో రాజోలి మండలం తూర్పు గార్లపాడు కు చెందిన రిపోర్ట్ ర్ నాగేశ్వర్ రెడ్డి బహుజన్ సమాజ్ పార్టీ అలంపూర్ నియోజకవర్గ కోశాధికారిగా నియమితులయ్యారు.
ఈ సందర్భంగా నాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ
నాయకుల లోపం, నాయకత్వ లోపం ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి చెందించాలంటే అది కేవలం బహుజన నాయకులు అధికారంలోకి వస్తేనే సాధ్యం అన్నారు.
ప్రజలను ఓట్లు వేసే యంత్రాలుగా చూస్తున్న నాయకులకు ఓటు వేద్దామా!
సామాన్య ప్రజలను సైతం లీడర్లుగా మార్చే మహనీయుల పార్టీకి ఓటేద్దామా అని అన్నారు.
ఇంకెంతకాలం ఈ కుటుంబ పాలనకు, మతతత్వ పాలనకు ఓటేద్దాం అని అన్నారు.
తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ ,బీసీ, మైనారిటీ ,అగ్రవర్ణాల్లోని పేదల్లో ఎంతోమంది అర్హత ఉన్న అవకాశాలు లేని నాయకులు ఉన్నారు అని అయన అన్నారు.
రండి కదలి రండి చైతన్యవంతులై ముందుకు రండి,
రెపరెపలాడే నీలి జెండాను చేతబట్టి
రాజ్యాంగం మనకు ఇచ్చిన హక్కులను బహుజన్ సమాజ్ పార్టీలో మన వాటాను రేపటి తరాల భవిష్యత్తుకు అందించడం కోసం పోరాటం చేద్దాం రండి అన్నారు.
మన ఓట్లతో గద్దెనెక్కి మనమీద పెత్తనం చెలాయించే వారికి బుద్ధి చెబుదాం రండి అన్నారు.
ఇప్పుడు గనక మనం మేలుకోకపోతే రాష్ట్రం మరో 40 ఏళ్లు అభివృద్ధిలో వెనక్కి వెళ్లే అవకాశం ఉంది,
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి , బహుజన తెలంగాణ కోసం అలుపెరగని కృషి చేస్తున్న మన నాయకుడు R.S ప్రవీణ్ కుమార్ గెలుపుకు కృషి చేయడానికి ప్రతి ఒక్కరూ బహుజన తెలంగాణ ఉద్యమంలో ఉద్యమ కాగడాలై ముందుకు రావాలి పిలుపు నిచ్చారు.
ఈసమావేశం అలంపూర్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి రవిచంద్ర, వడ్డేపల్లి మండల నాయకులు జలంధర్, నాగేష్, రాజోలి మండల నాయకులు తిరుపాల్,వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు.
బీఎస్పీ పార్టీ అలంపూర్ నియోజకవర్గ కోశాధికారిగా నాగేశ్వర్ రెడ్డి




