మాల్కపెట్ రిజర్వాయర్ కు కర్రోల్ల నర్సయ్య పేరు పెట్టాలి. బిఎస్పీ రాష్ట్ర నాయకులు ఆంకని భాను.
మల్కాపేట్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కు మాజీ శాసనసభ్యులు మల్కాపేట్ వాస్తవ్యులు కర్రోల్ల నరసయ్య పేరు పెట్టారని బిఎస్పి రాష్ట్ర నాయకులు అంకని భాను డిమాండ్ చేశారు. బుధవారం ఏర్పాటు చేసి సమావేశంలో బీఎస్పీ రాష్ట్ర నాయకులు అంకని భాను మాట్లాడుతూ కొనారావుపేట మండలం మల్కాపేట్ గ్రామానికి చెందిన కర్రోళ్ల నరసయ్య తెలంగాణ సాయుధ పోరాట యోధుడుగా పీడిత ప్రజల పక్షాన అనేక ఉద్యమాలు చేశారని అన్నారు. పిడిఎఫ్ అభ్యర్థిగా 1957లో శాసనసభ్యులుగా ఎన్నికై 62 వరకు సేవలందించారని తెలిపారు. మల్కాపేట్ బ్యాలెన్స్ రిజర్వాయర్ కు కర్రోల్ల నరసయ్య పేరు పెట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. బహుజన్ సమాజ్ పార్టీ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో బీఎస్పీ రాష్ట్ర నాయకులు ఎలగందుల వెంకన్న, జిల్లా అధ్యక్షులు వరద వెళ్లి స్వామి గౌడ్, మేకల మునిందర్, బొడ్డు మహేందర్, యాదగిరి, రమేష్, మల్లేశం, నరేందర్ ,శ్రీనివాసులు పాల్గొన్నారు.