Tuesday, 3 November 2026

మాల మహానాడు అలై బలై కార్యక్రమం

మాల మహానాడు అలై బలై
కార్యక్రమం
రఘునాధపాలెం డిసెంబర్ 01 జనం సాక్షి రమణగుట్ట 58వ డివిజన్ మాలల అలై బలై కార్యక్రమం పెద్ద మాల గుమ్మడి రామకృష్ణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి శ్వేత పాల్గొని మాట్లాడాతూ అందరూ ఐక్యంగా ఉండి తమ తమ పనులను ధర్మాన్ని నెరవేర్చుకుంటే జీవితంలో రాణించగలరని అలాగే మరో అతిధి పల్లా రాజశేఖర్ హైకోర్టు అడ్వకేట్ మనం కుల పరంగా ఐక్యంగా ఉండి మనకు రావాల్సిన వాటాను ప్రభుత్వ నుండి ఎలా పొందాలో వివరించారు మరో నాయకులు లింగాల రవికుమార్ మనకు భారత రాజ్యాంగం ద్వారా వచ్చిన వెసులుబాటును మనందరం అద్దిపిచ్చుకోవాలని ఆ క్రమంలో ఈరోజు మీరంతా కలవడం వలన ఒక పండుగ వాతావరణం కనిపిస్తుందని కొనియాడారు మాల మానాడు జిల్లా మాల మహానాడు నాయకులు కొట్టే సుధాకర్ ఎర్ర గంగాధర్ కుమ్మరి వీరబాబు ఖాదర్ బాబు తదితరులు పాల్గొన్నారు