Thursday, 5 November 2026

మాల మహానాడు గ్రామ కమిటీ ఎన్నిక

మాల మహానాడుమండల అధ్యక్షులు బొబ్బిలి రాజు
మహా ముత్తారం జనవరి 21 (జనం సాక్షి) తెలంగాణ మాల మహానాడు జిల్లా అధ్యక్షులు ఆదేశాల మేరకు మండల అధ్యక్షులు బొబ్బిలి రాజు ఆధ్వర్యంలో గ్రామ కమిటీ ఎన్నిక జరిపారు. శనివారం మండలంలోని మాదారం గ్రామంలో మాలవాడలో గ్రామ కమిటీని నియమించారు. మాదారం గ్రామ కమిటీ అధ్యక్షులు మేడిపల్లి శ్రావణ్ కుమార్, ఉపాధ్యక్షులు సకినాల అరవింద్, ప్రధాన కార్యదర్శి మేడిపల్లి శ్రీనివాస్, సహాయ కార్యదర్శి పంతకాని మహేష్, కోశాధికారి రాయమల్ల నీలయ్య, ప్రచార కార్యదర్శి సకినాల కృష్ణస్వామి కమిటీలు నియమితులయ్యారు. అనంతరం మండల అధ్యక్షులు బొబ్బిలి రాజు మాట్లాడుతూ గ్రామ కమిటీలు ఎన్నుకోవడం వారు మన మాలల కోసం మన మన హక్కుల కోసం మనమంతా కలిసికట్టుగా చురుకుగా పనిచేయాలని వారు తెలిపారు. మండలంలో కాని జిల్లాలో కాని రాష్ట్రంలో కానీ ఎక్కడైనా దళితులకు అన్యాయం జరుగుతే అక్కడ మనం ఉండాలని అన్నారు. ప్రతి గ్రామ గ్రామాన కమిటీలు వేసి అనంతరం మండల కేంద్రంలో రాష్ట్ర నాయకులతోనే పెద్ద భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసుకొని మన సమస్యలు మాట్లాడుకోవడం జరుగుతుందని తెలిపారు. గ్రామ కమిటీ అధ్యక్షులు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యవర్గ కమిటీ సభ్యులు సకినాల సతీష్, భూ పెళ్లి కిషన్, మేడిపల్లి వెంకటయ్య, పంత కానీ చిన్న సారయ్య, మంచినీళ్ల కిష్టయ్య, సకినాల కిష్ట సామి, తదితరులు పాల్గొన్నారు.