కొడకండ్ల,జనవరి21(జనంసాక్షి)మండల కేంద్రంలొని జడ్పీహెచ్ఎస్ హైస్కూల్ కు 1999- 2000 పదవ తరగతి బ్యాచ్ విద్యార్థుల తరపున హైస్కూల్ కు కంప్యూటర్ బహుకరించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రస్తుతం చదువు తున్న విద్యార్థులకు అవసరాలకు ఉపయోగపడే విధంగా కంప్యూటర్ ను ఇవ్వడం జరిగిందని,విద్యార్థులు కష్టపడి చదివి మంచి పేరు తెచ్చుకోవాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మోడపల్లి సోమన్న, నక్క సారయ్య, కోట రఘుపతి, దేశ గాని సతీష్, తెలకలపల్లి ముత్యాలు, పెళ్లి మహేందర్, రాపోలు విజేందర్, నర్మెట మంజుల, బంధు ఉమా,హై స్కూల్ హెచ్ఎం గ్రేస్ కెజియా రాణి, ఉపాధ్యాయుల పాల్గొనడం జరిగింది.




