Tuesday, 3 November 2026

మాసంపెల్లి లో ఘనంగా ఎంపీ కవిత పుట్టినరోజు వేడుకలు

మాసంపెల్లి లో ఘనంగా ఎంపీ కవిత పుట్టినరోజు వేడుకలు

ఊరు ఊరంతా దోలు వాయిద్యాలతో కవిత పుట్టినరోజు వేడుకలు

 

పుట్టినరోజు సందర్భంగా పేద విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ:తాటివారివేంపల్లి (మాసంపెల్లి) ఉపసర్పంచ్ గుగులోతు సురేష్

 

కొత్తగూడ జనవరి 1 జనంసాక్షి:ప్రజాసేవలో తనకు తానే సాటిగా నిలుస్తున్న మహబూబాబాద్ ఎంపి మాలోత్ కవిత పుట్టినరోజు వేడుకల సందర్భంగా కేక్ కట్ చేసి పేద విద్యార్థులకు నోటుబుక్కులు పెన్నులు పంపిణీ చేసి ఘనంగా నిర్వహించిన కొత్తగూడ బిఆర్ఎస్ నాయకులు,తాటివారివేంపల్లి ఉప సర్పంచ్ గుగులోతు సురేష్,అనంతరం బిఆర్ఎస్ యువ నాయకులు సురేష్ మాట్లాడుతూ ప్రజాప్రతినిధిగా బాధ్యతలతో పాటు సేవాకార్యక్రమాలనూ కొనసాగిస్తున్న కవితను ఉమ్మడి వరంగల్ ప్రజలు అభిమాన నేతగా గుండెల్లో నిలిచిపోవడం జరిగిందని అన్నారు.మహబూబాబాద్ జిల్లా బిఅర్ఎస్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నాటినుండి కార్యకర్తలకు ఎలాంటి కష్టం రాకుండా కాపాడుతుందని అన్నారు.కష్టాల్లో ఎవరున్నా…నేనున్నానంటూ వారికి భరోసానిస్తూ….ప్రజాసేవలో తనకు తానే సాటిగా నిలిచారు.ఎన్నో సేవా కార్యక్రమాలతో అందరి గుండెల్లో స్థానాన్ని సంపాదించారు.నాయకురాలిగా అన్ని వర్గాల అభివృద్ధికి పాటు పడుతూ,సబ్బండ వర్ణాల సంక్షేమమే ధ్యేయంగా ప్రజా సేవలో తనకంటూ ప్రత్యేక ముద్రను వేసుకున్న ఎంపీ కవిత అంటే మహబూబాబాద్ ప్రజలకు ఎనలేని అభిమానం…అక్కగా ఆమె అందరినీ ఆదరించడం…కష్టాల్లో నేనున్నానంటూ అక్కున చేర్చుకునే తీరు ఆమెకు ప్రత్యేక అభిమానాన్ని తెచ్చిపెట్టింది.బంగారు తెలంగాణ కల సాకారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న సీఎం కేసీఆర్‌ అడుగుజాడల్లో నడుచుకుంటూ అందరి గుండెల్లో అభిమానాన్ని సొంతం చేసుకున్న కవిత…డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ కుమార్తె…తండ్రికి తగిన కుమార్తెగా ఎంపీ మాలోత్ కవిత తనదైన శైలిలో మహబూబాబాద్ లో ప్రత్యేక ముద్ర వేసుకున్నారని అన్నారు.నిరుపేదలకు ఆకలి తీర్చుతూ వారి నుంచి ఆశీస్సులు పొందుతున్నారు.కరోనా సమయంలో ఎనలేని సేవలు,ప్రజలకు అండగా నిలిచారు.అక్క కోసం నేను ఎంత చేసినా తక్కువనే అంటున్న సురేష్…కవితమ్మ మహబూబాబాద్ లో ఉండడం దేవుడిచ్చిన వరం.ప్రజలకు నిత్యం సేవ చేయాలనే తపన తప్ప మరొకటి అక్క కు లేదు.నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సంతోషంగా,ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని డోలు చప్పులతో పండుగ వాతావరణాన్ని నెలకొల్పారు.