మంత్రి వేముల కు శుభాకాంక్షలు తెలిపిన వన్నెల్ బి,బి ఆర్ ఎస్ నాయకులు
బాల్కొండ జనవరి 1 ( జనం సాక్షి )
బాల్కొండ మండలం వన్నెల్. బి గ్రామానికి చెందిన బి ఆర్ ఎస్ నాయకులు, హైద్రాబాద్ లోని రోడ్లు, భవనాలు శాసన వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నివాసం లో కలిసి నూతన సంత్సరం మరియు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు,
ఈ కార్యక్రమం లో బాల్కొండ మండల రైతు సమన్యాయ సమితి కో ఆర్డినేటర్ నాగులపల్లి రాజేశ్వర్,
బి ఆర్ ఎస్ మండల ఉపాధ్యక్షుడు గడ్డం మహేష్, బి ఆర్ ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు శ్రీకాంత్ చారి, మగ్గిడి రాయదాస్, సాయన్న,రాజగంగారాం పాల్గొన్నారు.




