Wednesday, 4 November 2026

మా ఆకాంక్ష…ఆలోచన యువత భవిష్యత్‌ కోసమే – జెడ్పి చైర్మన్‌ పుట్ట మధూకర్‌

 

 

 

 

 

 

జనంసాక్షి, మంథని : ఈ ప్రాంతంలోని పేద విద్యార్ధులు, ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ పరీక్షలకు సిద్దమయ్యే అభ్యర్దుల భవిష్యత్‌ కోసమే తమ ఆలోచన, ఆకాంక్ష ఉంటుందని జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ అన్నారు. టీఎస్‌పీఎస్‌ఈ ఉద్యోగాల పోటీ పరీక్షలకు సిద్దమవుతున్న విద్యార్ధులకు పుట్ట లింగమ్మ ఆధ్వర్యంలో వసతి, బోజన సౌకర్యం కల్పించారు. మంథని పట్టణంలోని గ్రంధాలయ సమీపంలో అద్దె ఇంటిలో సోమవారం అభ్యర్ధులకు బోజనాలను పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ , గ్రంధాలయ చైర్మన్ రఘువీర్ సింగ్ ,మంథని మున్సిపల్ ఛైర్పర్సన్ పుట్ట శైలజ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… ప్రభుత్వం టీఎస్‌పీఎస్‌ఈ ద్వారా ఉద్యోగాల కోసం నిర్వహించే పరీక్షలకు సిద్దమయ్యే అభ్యర్ధులకు గ్రంధాలయాల్లో అన్ని వసతులు కల్పించాలని, వారికి మున్సిపాలిటీల ద్వారా బోజన వసతి కల్పించాని మంత్రి కేసీఆర్‌ ఆదేశాలు జారీ చేయగా మంథని మున్సిపల్‌లో ఆర్థిక పరిస్థితులు బాగలేకపోవడంతో పోటీపరీక్షలకు సిద్దమయ్యే అభ్యర్దులు తనను ఆశ్రయించి బోజన వసతి కల్పించారని కోరినట్లు ఆయన తెలిపారు. ఈ నియోజకవర్గంలో బీద కుటుంబానికి చెందిన తాము ఈ స్థాయికి చేరుకున్నామని, అయితే అన్నం పెట్టేవారు ఉన్నారని అట్టడుగు వర్గాలు తమను గుర్తించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రభుత్వ కళాశాలల్లోని పేద విద్యార్ధులకు మూడు మాసాలు, పోటీ పరీక్షలకు సిద్దమయ్యే అభ్యర్ధులకు మూడు నాలుగు మాసాలు అన్నం పెట్టే అవకాశం రావడం మా అదృష్టమన్నారు. ఉన్నత చదువులు చదువుకుని ఉద్యోగాల కోసం పోటీ పరీక్షలకు సిద్దమయ్యే నిరుపేద కుటుంబాలకు చెందిన యువతకు తమవంతు సహాకారం ఎల్లప్పుడు ఉంటుందని, ఈ క్రమంలో అభ్యర్ధులు మంచిగా పోటీ పరీక్షలకు సిద్దమయ్యే విధంగా అద్దె ఇంటిలో కూలర్‌, కుర్చీల సౌకర్యం కల్పించామన్నారు. పట్టుదలతో చదవుకుని ప్రయోజకులు కావాలన్నదే తమ ఆకాంక్ష అని ఆయన అన్నారు. ప్రభుత్వం నిర్వహించే టీఎస్‌పీఎస్‌ఈ పోటీ పరీక్షల్లో ఉద్యోగాలు సాధించి అగ్రస్థానంలో నిలువాలని ఆయన ఈ సందర్బంగా అభ్యర్ధులకు పిలుపునిచ్చారు. పోటీ పరీక్షలు పూర్తయ్యే వరకు అభ్యర్ధులకు రెండు పూటలా బోజనం అందిస్తామని, ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా పోటీ పరీక్షలకు సిద్దం కావాలని ఆయన స్పష్టం చేశారు.