హైదరాబాద్:వాయిదాలు పడుతూ వస్తోన్న ‘మా’ ఎన్నికల కౌంటింగ్‌కు సిటీ సివిల్ కోర్టు లైన్ క్లియర్ చేసింది. ఎన్నికల ప్రత్యేకాధికారి కృష్ణమోహన్ సమక్షంలో శుక్రవారం ‘మా’ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టాలని కోర్టు సూచించింది. ఎన్నికల నిర్వహణపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పిటిషన్ దాఖలు చేసిన పిటిషనర్ ఓ .కల్యాణ్‌పై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు పైన్ విధించింది.




