హైదరాబాద్: శేషాచలం ఎన్ కౌంటర్ లో చనిపోయిన కూలీల మృతదేహాలకు నిర్వహించిన శవ పరీక్ష నివేదకలు, నమోదు చేసిన కేసుకు సంబంధించిన ఎ ఫ్ఐఆర్ కాపీలను తమకు అందజేయాలని ఉమ్మడి కోర్టు ఏపీసర్కార్ కు ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా కేసు పై ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణ చేయిస్తున్నామని ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాది తెలపడంతో… దానికి సంబంధించి వివరాలు అందజేయాలని కోర్టు కోరింది.




