హైదరాబాద్: సంఘవిద్రోహుల శక్తులపై ఏ ప్రభుత్వమైనా కఠినంగా వ్యవహరించాలని టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. అసెంబ్లీలో నయీం ఎన్‌కౌంటర్‌పై చర్చలో ఆయన మాట్లాడుతూ టీడీపీ హయాంలో నయీం దందాలు మొదలయ్యాయన్న జీవన్‌రెడ్డి వ్యాఖ్యాలపై మండిపడ్డారు. 12ఏళ్ల క్రితం అధికారంలో ఉన్న పార్టీని విమర్శించడం తగదన్నారు. నయీం డైరీని వెంటనే బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. నయీం ఆక్రమించుకున్న భూములను స్వాధీనం చేసుకోవాలని, ఫాస్ట్‌ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి బాధితులకు న్యాయం చేయాలన్నారు. కేసు సత్వరమే పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. నయీం కేసులో నిష్పక్షపాతంగా, సీబీఐతో విచారణ జరిపించాలని ఎమ్మెల్యే సండ్ర సభకు తెలియజేశారు.
మా పార్టీని విమర్శించడం తగదు: సండ్ర




