హైదరాబాద్: కాంగ్రెస్ పదేళ్ల కాలంలోనే నయీం దందాలు జరిగాయని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. నయీం ఎన్‌కౌంటర్‌పై చర్చ సందర్భంగా టీడీపీ హయాం నుంచే నయీం దందాలు మొదలయ్యాయని, టీడీపీ హయాంలో ఉన్న సగంమంది మంత్రులు ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నారని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి చేసిన విమర్శలపై కేసీఆర్ మాట్లాడుతూ నయీం నేర చర్యలకు పాల్పడుతున్న సమయంలో జీవన్‌రెడ్డి సైతం కేబినెట్ మంత్రే అని…అప్పుడు ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. ఒకరిపై ఒకరు నిందలు మానుకోవాలని…అర్థవంతమైన చర్చ జరగాలన్నారు. తమపై నిందలు వేయాలని చూడొద్దని సీఎం కేసీఆర్ తెలిపారు.




