– నరేష్‌తో పాటు జీవిత, రాజశేఖర్ గెలుపు
– ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిండెంట్‌గా శ్రీకాంత్ ఓటమి
– తెల్లవారు జామున వెలువడిన ఫలితాలు
హైదరాబాద్, మార్చి11(జనంసాక్షి) : తీవ్ర ఉత్కంఠ నడుమ మూవీ ఆర్టిస్ట్ ఎన్నికల ఫలితాల వెలువడ్డాయి. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా హీరో నరేష్ విజయం సాధించారు. శివాజీ రాజాకు 199 ఓట్లు రాగా నరేశ్‌కు 268ఓట్లు పోలయ్యాయి. 69ఓట్ల ఆధిక్యంతో నరేశ్ గెలుపొందినట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. ఆయనతో పాటు ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా హీరో శ్రీకాంత్‌పై రాజశేఖర్ గెలుపొందారు. జనరల్ సెక్రటరీగా రఘబాబుపై జీవిత గెలుపొందారు. అయితే గత ఎన్నికల్లో శివాజీరాజా ప్యానల్ నుండి ఈసీ మెంబర్‌గా పోటీ చేసిన నటి హేమ.. ఈసారి ఉపాధ్యక్షురాలి పదవికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలవడం విశేషం. జాయింట్ సెక్రటరీగా బిగ్‌బాస్-1 విజేత శివ బాలాజీ గెలుపొందారు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు ఓటింగ్ పూర్తికాగా.. రాత్రి 8 గంటలకు ఫలితాలు ఉంటాయన్నారు. అయితే సోమవారం తెల్లవారు జాము 4:30 గంటల వరకూ ఉత్కంఠ రేకెత్తిస్తూ కౌంటింగ్‌ను కొనసాగించడం విశేషం. గత ఎన్నికల్లో ఈవీఎంలను ఉపయోగించి ‘మా’ ఎన్నికలు నిర్వహించగా.. ఈసారి బ్యాలెట్ పత్రాలను ఉపయోగించడంతో కౌంటింగ్‌కి ఆలస్యం అయ్యింది. నువ్వా.. నేనా అంటూ సాగిన ఈ ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక ఓటింగ్ నమోదైంది. సుమారు 800మంది ఆర్టిస్ట్‌లు మూవీ ‘మా’
అసోసియేషన్‌లో ఉండగా.. రికార్డు స్థాయిలో 472 ఓట్లు నమోదు అయ్యాయి. ఇప్పటి వరకూ ఇదే హిస్టరీలో హయ్యెస్ట్ ఓట్లు నమోదైంది ఈ ఎన్నికల్లోనే. 2015లో 394 ఓట్లు నమోదు కాగా.. 2017లో ఏకగ్రీవం అయ్యింది. ఎన్నికల ఫలితాల తరువాత జీవితా రాజశేఖర్, తన ప్యానల్‌తో కలిసి నరేష్ విలేకరులతో మాట్లాడారు.. మిత్రమా శివాజీ రాజా.. నాకు యాభై ఓట్లుకూడా రావు అన్నావు.. జీవితంలో ప్రసెడెంట్‌వి కాలేనన్నావ్.. ఇప్పుడు ఏమైందో చూశావుగా అని అన్నారు. గతాన్ని ఇక తవ్వుకోను అని.. భవిష్యత్ కోసమే ఆలోచిస్తానని నరేష్ అన్నారు. ‘నా విజయంలో భాగస్వామ్యమైన నా ప్యానల్ వారికి, గెలుపుకు సహకరించిన కార్యకర్తలు, విూడియాకి ధన్యవాదాలు తెలిపారు. నేను అడిగిన వెంటనే నీ పక్కన నేను ఉంటాను అన్నయ్యా.. జనరల్ సెక్రటరీ పోటీచేస్తా అని ముందుకు వచ్చిన నాచెల్లెలు జీవిత రాజశేఖర్‌కి రుణపడి ఉంటానని అన్నారు. నేను ఎప్పుడూ నమ్మేది ఒక్కటేనని, తల్లిదండ్రులని పెద్దలని మనం గౌరవించినప్పుడు వాళ్లని మన బిడ్డల్లా చూసుకున్నప్పుడు భగవంతుడు ఎప్పుడూ గెలిపిస్తాడని నరేష్ అన్నారు. అదేవిధంగా మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, నాగబాబు మాకు విషెష్ అందించారని, ప్రత్యేకించి నాగబాబు మాకు అండగా నిలిచారన్నారు. చిరంజీవి స్థాపించిన ఈ ‘మా’ని మేం ముగ్గురం ముందుకు నడిపిస్తామని నరేష్ అన్నారు.
ఎవరెవరు గెలిచారంటే ..
‘మా’ప్రెసిడెంట్‌గా శివాజీ రాజాపై నరేష్ గెలుపొందారు. ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా శ్రీకాంత్ పై రాజశేఖర్ గెలిపొందారు. వైస్ ప్రెసిడెంట్‌గా ఎస్. వి. కృష్ణారెడ్డి, హేమలు విజయం సాధించారు. జనరల్ సెక్రటరిగా రఘుబాబు పై జీవిత రాజశేఖర్ గెలుపొందారు. జాయింట్ సెక్రటరీగా గౌతమ్ రాజుపై శివబాలాజీ గెలుపొందారు. ట్రెజరర్‌గా కోట శంకర్రావుపై రాజీవ్ కనకాల విజయం సాధించారు. అదేవిధంగా ఈసీ మెంబర్‌లుగా అలీ, రవిప్రకాష్, తనికెళ్ల భరణి, సాయికుమార్, ఉత్తేజ్, పృథ్వి, జాకీ, సురేష్ కొండేటి , అనితా చౌదరి, అశోక్ కుమార్, సవిూర్, ఏడిద శ్రీరామ్, రాజా రవీంద్ర, తనీష్, జయలక్ష్మి, కరాటి కళ్యాని, వేణుమాధవ్, పసునూరి శ్రీనివాస్‌లు గెలుపొందారు.
‘మా’ ప్రెసిడెంట్‌గా నరేష్




