
కొడకండ్ల, మార్చి17 (జనం సాక్షి ) జనగామ జిల్లా
కొడకండడ్లలోని అంబేద్కర్ కాలనీ ఎదురుగా గల ప్రభుత్వ స్థలాన్ని, రామవరం రోడ్డులో గల ప్రభుత్వ స్థలాన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు పరిశీలించారు.అనంతరం మంత్రి మాట్లాడుతూ
మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా త్వరలో కొడకండ్లలో మినీ టెక్స్టైల్ పార్కుకు శంకుస్థాపన చేయనున్నట్లు,
కనీసం 20 ఎకరాల స్థలం అవసరం కాగా, భవిష్యత్తు అవసరాల రీత్యా అంతకంటే ఎక్కువ స్థలాన్ని పరిశీలిస్తున్నాం అని తేలిపారు.
అంబేద్కర్ నగర్ ఎదురుగా గల 50 ఎకరాల స్థలాన్ని పార్క్ కి అప్పగిస్తే భవిష్యత్తులో టెక్స్టైల్ పార్క్ విస్తరణకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయని,
అలాగే రామవరం రోడ్డులో గల పది ఎకరాల స్థలం, అదనంగా మరోచోట 18 ఎకరాల స్థలం కూడా టెక్స్టైల్ పార్కు అప్పగించాలని ఆలోచిస్తున్నామని అన్నారు.
ప్రస్తుతం స్థలాలను పరిశీలించి అన్ని రకాల పరిశీలనల తర్వాత స్థలాల కేటాయింపు జరుగుతుంది తేలిపారు.
కొడకండ్ల లో మినీ టెక్స్టైల్ పార్క్ ఏర్పాటుతో కొడకండ్ల ప్రజల కష్టాలు తీరుతాయని,
వలస వెళ్లే ఇక్కడి ప్రజలు తిరిగివచ్చే అవకాశం ఉందని,వేలాది మందికి ఉపాధి దొరుకుతుంది అని,
ఇక్కడి చేనేత కార్మికులకే కాక, చేనేత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న ఇతర వర్గాల ప్రజలకు కూడా ఉపాధి లభిస్తుంది మంత్రి అన్నారు.ఈ కార్యక్రమంలో జనగామ జిల్లా అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, ఆర్డీవో కృష్ణవేణి, స్థానిక ప్రజా ప్రతినిధులు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, రెవెన్యూ ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
మినీ టెక్స్టైల్ పార్క్ స్థలాలను పరిశీలించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు




