Friday, 6 November 2026

రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబానికి పెద్ద ఆపద.

– ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని వినతి.
బెల్లంపల్లి, మార్చ్ 17, (జనంసాక్షి )
రెక్కాడితే గాని డొక్కాడని పేద గిరిజన కుటుంబానికి పెద్ద ఆపద వచ్చింది. మనసున్న మారాజులు ఆదుకోవాలని ఆ నిరుపేద గిరిజన కుటుంబం వేడుకుంటుంది. వివరాల్లోకి వెళితే బెల్లంపల్లి నియోజకవర్గం నెన్నెల మండలం నెన్నెల గ్రామపంచాయతీ పరిధిలోని దుబ్బగూడెం గ్రామానికి చెందిన గంట శంకర్ – చిన్నక్క దంపతుల కూతురు శ్యామలకు క్యాన్సర్ నిర్దారణ అయింది. రెక్కాడితే గాని డొక్కాడని ఆ కుటుంబానికి ఈవిషయం శరాఘతంగా తగిలింది. అసలే అంతంత మాత్రంగా నడుస్తున్న ఆ కుటుంబానికి తిండికే తిప్పలు పడుతున్న తమకు చికిత్స చేయించేది ఎలా అని ఆ నిరుపేద కుటుంబం ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తుంది. తాము బతకడమే కష్టంగా ఉన్న ఈపరిస్థితుల్లో ఇంత పెద్ద జబ్బుకు ఎలా చికిత్స చేయించేది అని మదన పడుతున్నారు. ఈ కుటుంబానికి సాయం చేయదలుచుకున్న వారు 9948107847కు ఫోన్ పే, లేదా గూగుల్ పే చేయగలరు. ఈ నంబర్ కోవిడ్ వాలంటీర్స్ నెన్నెల, సోపతి వెల్ఫేర్ సొసైటీ జలంపల్లి శ్రీనివాస్ ది.