Wednesday, 4 November 2026

మిర్చి దొంగలు రిమాండ్ కుతరలింపు

 

 

 

 

 

మల్దకల్ ఫిబ్రవరి 13 (జనం సాక్షి) గత వారం రోజుల క్రితం మల్దకల్ మండల పరిధిలోని బిజ్వారం గ్రామంలోని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు మిర్చి దొంగతనానికి ప్రయత్నించగా మల్దకల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు.దొంగతనానికి పాల్పడిన ఐజ గ్రామానికి చెందిన ఏలే విష్ణు,ఐజ మండలం ఏక్లాస్ పురం గ్రామానికి చెందిన కుర్వ ఆంజనేయులు కేసు నమోదు అయింది.అట్టి దొంగతనానికి ప్రయత్నించిన వ్యక్తులు గుర్తించి విచారించగా వారు నేరాన్ని ఒప్పుకున్నారు. సోమవారం వారిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచగా జడ్జి రిమాండ్ ఆదేశించి జైలుకు పంపినట్లు మల్దకల్ ఎస్సై ఆర్ శేఖర్ తెలిపారు.ఇటిక్యాల, గట్టు,ఐజ,గద్వాల రూరల్ పోలీస్ స్టేషన్ల పరిధిలో వారిపై కేసులు నమోదయ్యాయి. దొంగతనానికి పాల్పడి దొంగిలించిన నాలుగు బైకులను స్వాధీనం చేసుకున్నారు