:
శ్రీకాంత్ : శామీర్ పేట్, జనం సాక్షి : గ్రామ పంచాయతీ సిబ్బంది కి రావాల్సిన పెండింగ్ జీతాలు వెంటనే విడుదల చెయ్యాలని శామీర్ పేట్ పంచాయతీ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి మొరుగు
శ్రీకాంత్ డిమాండ్ చేశారు. సోమవారం శామీర్ పేట్ గ్రామ పంచాయతీ లో సర్పంచ్ బాలమణి కి పంచాయతీ సిబ్బంది జీతాలు, సిబ్బంది కి ఇచ్ఛే సబ్బులు, నూనెలు, చెప్పులు ఇవ్వాలని మెమోరాండం అంద జేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్మికులు స్వామి, పోచయ్య,రాములమ్మ, సుగుణమ్మ,కమలమ్మ తదితరులు పాల్గొన్నారు.
13ఎస్పీటీ -3: సర్పంచ్ కు మెమోరాండం అంద జెస్తున్న కార్మికులు




