Thursday, 5 November 2026

మిర్చి పంటను పరిశీలించిన వ్యవసాయ శాస్త్రవేత్తలు

మిర్చి పంటను పరిశీలించిన వ్యవసాయ శాస్త్రవేత్తలు

టేకులపల్లి, నవంబర్ 22 (జనం సాక్షి): ఇటీవల టేకులపల్లి మండలంలో మిర్చి పంటలకు తెగులు సోకి అక్కడక్కడ మిర్చి పంటలను రైతులు పీకేస్తున్నారని సమాచారంతో వ్యవసాయ అధికారుల ఆధ్వర్యంలో మంగళవారం ముత్యాలంపాడు క్రాస్ రోడ్డు, శాంతినగర్ గ్రామాలలో రైతుల మిర్చి పంటలను శాస్త్రవేత్తలు వ్యవసాయ అధికారులు సందర్శించి పరిశీలించారు. కెవికె కోఆర్డినేటర్ లక్ష్మీనారాయణమ్మ, వ్యవసాయ శాస్త్రవేత్త శివ మిర్చి పంటను పరిశీలించి రైతులకు సూచనలు సలహాలు ఇచ్చారు. ఈ ప్రాంతంలో మిర్చి పంటను ఎక్కువగా ఎండు తెగులు ఆశించడం వలన రైతులు నష్టపోతున్నారన్నారు. ఈ ఎండు తెగులకు, క్రింద ముడత పై ముడత రాకుండా ముందే జాగ్రత్తలు తీసుకోవాలని అందుకు రైతుకు పలు సూచనలు చేశారు. మిర్చి పంటను ప్రధానంగా పొలంలో నాటడానికి ముందే నాలుగు కేజీల ట్రైకోడెర్మా పౌడర్ ను, 100 కేజీల పశువుల ఎరువులు కలిపి లీటర్ బెల్లం నీళ్లు చల్లి వారం రోజులపాటు ట్రైకోడెర్మా బ్యాక్టీరియాను వృద్ధి చెందేలా చేశాక దుక్కిలో చల్లుకోవాలి. రైతులకు అవగాహన లేక పోవడంతో రెండు లేదా నాలుగు కేజీల ట్రైకోడెర్మా ను మాత్రమే వేయడం వలన ఫలితం లేక మొక్కలు ఎండిపోతున్నాయి. ట్రైకోడెర్మా అందుబాటులో లేకపోతే కాపర్ ఆక్సి క్లోరైడ్ మూడు గ్రాములు ఒక లీటరు నీటికి కలిపి మొక్క మొదల్లో మాత్రమే తడిచేలా పోసుకోవాలన్నారు. సాధ్యమైనంతవరకు డ్రిప్ ద్వారా నీరు అందించడం వలన ఎండు తెగులు రాదు. పంట చుట్టూ ఒక వర్షం ఒక్క జొన్న లేదా మొక్కజొన్న పంటలను విత్తుకోవడం వలన తామర పురుగు, రసం పీల్చే పురుగు రాకుండా కాపాడుకోవచ్చునన్నారు. తామర పురుగు నల్లి ఆశించినట్లయితే వేప నూనె, ప్రిఫో నిల్ + ఎమిడోక్లోసిడ్ ( పోలీస్)( జంప్ )కానీ, సియాంత్రిని పోల్ 250 గ్రాములు ఎకరానికి ( ప్రోక్లైన్ ) 100 గ్రాములు ఒక ఎకరానికి పిచి