జాబితాలో తన పేరు రాలేదని మనస్థాపానికి వాటర్ ట్యాంక్ ఎక్కిన రైతు…??
జనం సాక్షి /కొల్చారం పోడు భూముల సర్వే జాబితాలో తన పేరు రాలేదని మనస్థాపనతో ఓ రైతు వాటర్ ట్యాంక్ పైకి ఎక్కి నిరసన తెలిపిన ఘటన మెదక్ జిల్లా కుల్చారం మండలంలో చోటుచేసుకుంది, పొడు భూముల పట్టాలు అందించేందుకు జిల్లా కలెక్టర్ ఆదేశాలతో మంగళవారం కొంగోడు గ్రామంలో గ్రామ సర్పంచ్ మంజుల సత్యనారాయణ అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు అయితే గ్రామానికి చెందిన దామరంచ దేవదాసు అనే రైతు తాను గత కొంతకాలంగా సాగు చేసుకుంటున్న అటవీ భూమి కి సంబంధించిన వివరాలు జాబితాలో రాకపోవడంతో అధికారులతో వాగ్వాదానికి దిగాడు. పంచాయతీ సెక్రటరీ నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ వాటర్ ట్యాంక్ పైకెక్కి నిరసన తెలిపారు. అక్కడే ఉన్న ఎస్ఐ సార శ్రీనివాస్ గౌడ్ రైతు దేవదాసును నచ్చజెప్పి కిందకి దించారు. దీంతో అంత ఊపిరి పీల్చుకున్నారు తన భూ సమస్య పరిష్కరించాలని దేవదాసు డిమాండ్




