Saturday, 7 November 2026

మిర్చి రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి – సి పి ఎం

మిర్చి రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి – సి పి ఎం

 

పెనుబల్లి, డిసెంబర్20 (జనం సాక్షి) పెనుబల్లి మండలం
తుమ్మలపల్లి గ్రామంలో సిపిఎం పార్టీ నాయకులు మంగళవారం ఎర్ర గొర్ల నాగేశ్వరరావు మిర్చి తోటను పరిశీలించడం జరిగింది, మిర్చి పంట దెబ్బతిన్న రైతులకు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి గాయం తిరుపతిరావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో దెబ్బతిన్న పంటలకు ప్రభుత్వం ఇన్సూరెన్స్ చెల్లించి రైతులను ఆదుకుంటుందని కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం రైతులకు ఇన్సూరెన్స్ చెల్లించడం లేదని దీని వలన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు గత రెండు సంవత్సరాలుగా జిల్లా వ్యాప్తంగా తెల్ల నల్లి ,తలమాడు ,గుబ్బ రోగం తో మిర్చి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయన్నారు కానీ ప్రభుత్వం మాత్రం రైతులను ఆదుకునే ఏ రకమైన చర్యలు తీసుకోవడం లేదని ఆయన అన్నారు, ఒక్కొక్క ఎకరానికి రైతుకి లక్ష నుంచి లక్షన్నర వరకు పెట్టుబడి పెట్టారని కానీ అందులో 20 శాతం కూడా పెట్టుబడి వచ్చే పరిస్థితి కూడా లేదన్నారు ,దీనివలన అప్పుచేసి పెట్టుబడి పెట్టిన రైతులు తీవ్రంగా నష్టపోయి అప్పుల పాలవుతున్నారన్నారు ,అప్పుల పాలైన అన్నదాతల అప్పులు చెల్లించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు, రైతులకు తమ ప్రభుత్వం రైతుబంధు చెల్లించి రైతులను లక్ష అధికారులు చేస్తున్నామని ఒకవైపు గొప్పలు చెప్పుకుంటుండగా మరోవైపు రైతులు వ్యవసాయం చేయలేక అప్పులపై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు, ఎకరానికి మిర్చికి లక్ష నుంచి లక్షన్నర పెట్టుబడి అవుతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఎకరానికి పదివేల రూపాయలు ఇస్తే రైతులు పెట్టిన మిగిలిన పెట్టుబడి పరిస్థితి ఏమిటి అని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు, పదివేల రూపాయల వల్ల రైతులకు జరిగిన ఉపయోగం ఏమీ లేదని ఇక కౌలు పరిస్థితి అత్యంత దారుణంగా ఉందన్నారు. కౌలు 20 నుంచి 25 వేల వరకు చెల్లిస్తున్నారని గతంలో రైతులకు ఇన్సూరెన్స్ చెల్లించేవారని కానీ ప్రభుత్వం ఇన్సూరెన్స్ ఎందుకు తీసే సిందో సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. పంటలు దెబ్బతిన్న రైతులను ఆదుకోకపోతే ప్రజాసంఘాల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా రైతులని సమీకరించి ఆందోళన నిర్వహిస్తామని ఈనెల 29 ,30 ,31 తేదీలలో వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జరిగే రాష్ట్ర మహాసభల్లో రైతులపై జరిగే అన్యాయాలను ప్రతిఘటించే విధంగా తీర్మానాలు చేస్తామని ఆయన అన్నారు, లక్షలాదిగా తరలి ఈనెల 29న జరిగే బహిరంగ సభను జయప్రదం చేయాలని ప్రజలను కోరడం జరిగింది .ఈ సమావేశంలో రైతు సంఘం మండల సహాయ కార్యదర్శి కొప్పుల వెంకటేశ్వరరావు ,సిపిఎం పార్టీ మండల కమిటీ సభ్యులు కండె సత్యం ,బాబు ,సంఘం సభ్యులు గడ్డం శ్రీను ,గాయం కృష్ణమ్మ, కృష్ణవేణి ,గొల్లమందల సంతోషి, కౌశల్య ,తదితరులు పాల్గొన్నారు