Thursday, 5 November 2026

మిర్యాలగూడ జిల్లా సాధనకై సకలజనులు ఉద్యమించాలి:అఖిలపక్ష నాయకులు పిలుపు

నేరేడుచర్ల(జనంసాక్షి )న్యూస్ : మిర్యాలగూడ జిల్లా సాధనకై మిర్యాలగూడ నియోజకవర్గం, నాగార్జునసాగర్ నియోజకవర్గం, హుజూర్ నగర్ నియోజకవర్గంలోని సకలజనులు ఉద్యమాల బాటపడితేనే జిల్లా సాధన సాకారమవుతుందని నేరేడుచర్ల,పాలకీడు,గరిడేపల్లి మండలాల అఖిలపక్ష నాయకులు అన్నారు.గురువారం నేరేడుచర్లలో జరిగిన అఖిల పక్ష సమావేశానికి హాజరైన పలువురు మాట్లాడుతూ వాణిజ్య, వ్యవసాయ,రాజకీయపరంగా ఎంతో ముందంజలో ఉన్న మిర్యాలగూడను జిల్లాగా ఏర్పాటు చేయాలని,ఈ మూడు నియోజకవర్గాలు కలిపితే సుమారు తొమ్మిది లక్షల జనాభా అవుతుందని,18 కి పైగా మండలాలు ఉన్నాయని, ముఖ్యంగా నేరేడుచర్ల ప్రాంతానికి జిల్లా కేంద్రం తలాపునే ఉంటుందని, మిర్యాలగూడకు జిల్లాకు కావాల్సిన అన్ని హంగులు ఉన్నాయని, రైలు సౌకర్యంతో పాటు అన్ని రకాల ప్రయాణ వసతులుఉన్నాయని, కృష్ణ పట్టే ప్రాంతంతో పాటు కృష్ణా నది పరివాహక ప్రాంతమంతా ఓకే జీవన విధానం కలిగి ఉంటుందని,అటు నల్లగొండ గాని ఇటు సూర్యాపేట గాని ఈ ప్రాంతానికి సంబంధం లేకుండా ఉన్నాయని,ఇప్పుడున్న 33 జిల్లాల కంటే మిర్యాలగూడ కే జిల్లా అయ్యే అర్హతలు ఎక్కువగా ఉన్నాయని,ప్రజల మనోభావాలను గుర్తించి గౌరవించి రాష్ట్ర ముఖ్యమంత్రి మిర్యాలగూడను జిల్లాగా ప్రకటించాలని వారు కోరారు.అఖిలపక్ష సమావేశానికి జ్వాలా వెంకటేశ్వర్లు, చేగొండి మురళి, కొణతం సత్యనారాయణ రెడ్డి, ధూళిపాళ ధనుంజయ నాయుడు,పాల్వాయి రమేష్, కొదమగుండ్ల నగేష్, బాల వెంకటేశ్వర్లు,బచ్చలికూరి ప్రకాష్,రాపోలు నవీన్,సరికొండ నాగేశ్వరరావు, పొనుగోటి జంగారావు, రావుల సత్యం, కె.అనంత ప్రకాష్, జనిగల శ్రీనివాస్, అబ్రహం,యల్ల బోయిన సింహాద్రి, నర్సింగు అంజయ్య, త్రిపుర సుధాకర్ రెడ్డి, మచ్చ సోమయ్య, నీలా రామ్మూర్తి, బాదే నరసయ్య,ముళ్ళ జానయ్య, కర్రీ సతీష్ రెడ్డి, ఇంజమూరి వెంకటయ్య, పత్తిపాటి విజయ్ కుమార్ తదితరులు హాజరయ్యారు.