Thursday, 5 November 2026

మిషన్‌కాకతీయతో జలకళ

చిన్ననీటి వనరుల పరిరక్షణే ధేయంగా ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ పనుల వల్ల గ్రామ గ్రామాన చెరువులు జలకళను సంతరించుకున్నాయి.ద్రోణి ప్రభావంతో వారం రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో పూడిక తీసిన చెరువుల్లో వర్షం నీరు వచ్చిచేరుతుంటే రైతన్నల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. నల్లగొండ జిల్లా మోత్కుర్ మండల కేంద్రంలోని కుంట చెరువు వర్షం నీటితో కళకళలాడుతోంది. చుట్టుపక్కల గ్రామాల రైతులు కూడా చెరువును చూసేందుకు తరలివస్తున్నారు.

మిషన్ కాకతీయ పనుల్లో భాగంగా కుంట చెరువును 35 లక్షల రూపాయల నిధులతో పూడిక తీసారు.. 20 వేల క్యుబిక్ మీటర్ల మట్టిని పూడిక తీసారు.. 3 కిలోమీటర్ల మేర ఈ చెరువు కింద పిల్ల కాల్వలను ,ఫీడర్ ఛానళ్లను అభివృద్ది చేశారు…దీంతో వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో భారీగా నీరు వచ్చి చేరుతున్నది..ప్రస్తుతం ఈ చెరువు పూర్తి స్తాయిలో నిండి అలుగు పోస్తున్నది… హైద్రాబాద్ లో కురుస్తున్న భారీ వర్షాలకు మూసి కాల్వ ద్వారా కూడా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో చెరువు నిండుకుండలా తొణికిసలాడుతున్నది. మిషన్ కాకతీయలో భాగంగా చెరువుపూడిక తీయడంవల్లనే నీటితో కళకళలాడుతోందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఈ చెరువు కింద 2 వేల ఎకరాల్లో పారుదల ఉన్నది… మోత్కుర్ మండలంలోని కొండగడప, సదర్శాపురం, గుండాల మండలంలోని వంగాల, షాపురం,పెద్ద పడిషాల గ్రామాల పరిధిలో 2 వేల ఎకరాల్లో ఈ చెరువు కింద పంటలు సాగుచేసుకుంటున్నరు. వర్షాలు లేటుగా కురిసినా… కుంట చెరువు కింద పొలాలకు ఎలాంటి ఢోకా లేదని రైతులు చెబుతున్నారు. సీఎం కేసీఆర్ ప్రణాళికాబద్ధంగా చెరువుల అభివృద్దికి కృషిచేస్తున్నారని ప్రశంసిస్తున్నరు.
భవిష్యత్‌లో కుంట చెరువు కట్టను మరింత బలోపేతంచేసి మూసీ,ఎస్ఆర్ ఎస్పీ నీటితో నిండేలా కాల్వలు తవ్వాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నరు. టీఆర్ఎస్ సర్కారు చొరవతో చెరువులు పూర్వవైభవాన్ని సంతరించుకుంటున్నాయని హర్షం వ్యక్తం చేస్తున్నరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *