ప్రెస్ నోట్. తేదీ.21-12-2022 మిషన్ భగీరథ కాంట్రాక్ట్ కార్మికుల అక్రమఅరెస్టులను ఖండించండి.CITU.. . అల్లూరి లోకేష్ సిఐటియు జిల్లాఅధ్యక్షులుమాట్లాడుతూ, . కొమురం జిల్లా కేంద్రంలో అంబేద్కర్ చౌదరి దగ్గర మిషన్ భగీరథ కాంట్రాక్ట్ కార్మికులు శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న సందర్భంగా పోలీసు యంత్రాంగం దౌర్జన్యంగా కార్మికులను చదరగొట్టి భయభ్రాంతులకు గురి చేస్తూ, అక్రమ అరెస్టులు చేయడానికి సిఐటియు తీవ్రంగా ఖండిస్తుంది. కొమురం భీం జిల్లా వ్యాప్తంగా మిషన్ భగీరథ పథకంలో కాంట్రాక్టు ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ దాదాపు 600 మంది కార్మికులు పనిచేస్తున్నారు. మిషన్ భగీరథ కార్మికులకు నెలనెల జీతాలను ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందుల గురిచేస్తున్న LNT యాజమాన్యం నిర్లక్ష్య వైఖరిని వ్యతిరేకిస్తూ, దశలవారీగా, శాంతియుత నిరసనలు తెలియజేస్తున్న, అనేక సందర్భాల్లో సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రాలు ఇచ్చిన జిల్లా అదనపు కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ గారితో LNT మేనేజర్, సంబంధిత గ్రిడ్ అధికారులతో ఈనెల 12వ తేదీన జయింట్ సమావేశం జరిగింది. మిషన్ భగీరథ కార్మికుల వేతనాలను ఈనెల 20 తేదీలోగా చెల్లించడానికి అంగీకరించి ఇప్పటికీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోకపోవడంతో కార్మికులు శాంతియుతంగా నిరసనలు తెలియజేస్తుంటే బలవంతంగా కార్మికులను అరెస్టు చేయడం సరైనది కాదు. ఇప్పటికైనా అరెస్టు చేసిన నాయకులను విడుదల చేయాలని, మిషన్ భగీరథ కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాల్ని అమలు చేయాలని, పెండింగ్లో ఉన్న మూడు నెలలు జీతాలు వెంటనే ఇవ్వాలని, మిషన్ భగీరథ కార్మికులకు స్కిల్ ,అన్ స్కిల్, సెమిస్కిల్ కేటగిరి వేతనాలను అమలు చేయాలని, జీవో నెంబర్ 60,లేదా 11ను అమలు చేసి కార్మికులకు ఆ GO ల ప్రకారంగా వేతనాలు చెల్లించాలని CITU డిమాండ్ చేస్తుంది. .ఈరోజు నుంచి కార్మికులు తమ జీతాలు ఇచ్చేవరకు ఇతర సమస్యలు పరిష్కరించే వరకు అన్ని పంప్ హౌస్ ల దగ్గర పనులు బంద్ పెట్టి సమ్మె చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. భవిష్యత్తులో జరుగుతున్న సమ్మెకు LNT యాజమాన్యం,సంబదిత అధికారులు చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించలని కోరుతున్నాం. లేని పక్షంలో ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నాం.. ఈ కార్యక్రమంలో దుర్గం లింగయ్య, మిషన్ భగీరథ కాంటాక్ట్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా కన్వీనర్, సర్ఫుద్దీన్ ,గోకుల్, బాలేష్, సాయిరాం, రవీందర్, తిరుపతి, రాజు తదితరులు పాల్గొన్నారు.
మిషన్ భగీరథ కాంట్రాక్ట్ కార్మికుల అక్రమఅరెస్టులను ఖండించండి




