Saturday, 7 November 2026

పారిశుద్ధ్య పనులను, పబ్లిక్ టాయిలెట్లను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ రాజకుమార్

పారిశుద్ధ్య పనులను, పబ్లిక్ టాయిలెట్లను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ రాజకుమార్*
మెట్పల్లి టౌన్, డిసెంబర్ 21,
జనం సాక్షి :
మెట్పల్లి పట్టణ కేంద్రంలో బుధవారం రోజున మున్సిపల్ కమిషనర్ రాజ్ కుమార్ పలు వార్డులలో పారిశుద్ధ్య పనులను, మరియు పబ్లిక్ టాయిలెట్లను పరిశీలించారు ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ మురికి కాల్వలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని ఆదేశించారు, ప్రజల నుండి తడి పొడి చెత్త వేరు వేరు చేసి తీసుకోవాలని తెలిపారు పబ్లిక్ టాయిలెట్లను నిర్వహించువారు ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని కోరినారు పారిశుద్ధ్య సిబ్బంది విధులలో నిర్లక్ష్యం చేసినచో కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా తెలియజేశారు. ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ విష్ణు, ముజీబ్, ధర్మేందర్ నరసయ్య, నిజాం, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు