వేములవాడ రూరల్, జూన్ 6, (జనం సాక్షి) : వేములవాడ అర్బన్ అగ్రహారం వద్ద మిషన్ భగీరథ గేట్ వాల్ గుంతలో పడిన వ్యక్తిని 108 సిబ్బంది మంగళవారం కాపాడారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రాయికల్ మండలానికి చెందిన బాబు అనే వ్యక్తి అగ్రహారం ప్రాంతంలో చిత్తు కాగితాలు, పాత సామాన్ సేకరిస్తూ జీవిస్తున్నాడు. మంగళవారం ఉదయం ఐదు గంటల ప్రాంతంలో రోజు లాగా పనిలోకి వెళ్ళగా అగ్రహారం ఆలయం సమీపంలో మిషన్ భగీరథ గేట్ వాల్ గుంత తెరిచి ఉండడంతో అందులో పడ్డాడు. మూడు గంటల అనంతరం అటుగా వెళ్తున్న స్థానికులు గమనించి 108 సిబ్బందికి సమాచారం అందించగా, వెంటనే స్పందించిన వారు పడిపోయిన వ్యక్తిని బయటకు తీసి ప్రాణాలు కాపాడారు. 108 సిబ్బంది ఈఎంటి రమణారెడ్డి, పైలెట్ బాలకృష్ణ లను స్థానికులు అభినందించారు.
మిషన్ భగీరథ గుంతలో పడిన వ్యక్తిని కాపాడిన 108 సిబ్బంది




