ఏటూరునాగారం (జనం సాక్షి)జూన్06.
పాఠశాలల బడిబాట కార్యక్రమంలో భాగంగా, ప్రభుత్వ మార్గదర్శకాలను ఆచరణలో పెట్టేవిదంగా, ఏటూరునాగారం మండలం లంబాడీతాండ గ్రామంలోని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పర్వతాల సతీష్ ఎక్కువ గంటలు విద్యార్థుల నమోదుకై, శ్రద్ద చూపారు.
ప్రభుత్వ బడులను మరింత బలోపేతం చేయడం, అడ్మిషన్ల సంఖ్యను పెంచడమే లక్ష్యంగా, ముందుకు వెళుతూ, అందరికి ఆదర్శంగా నిలిచారు. జూన్ 3 నుంచి 17 వరకు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
ఈ ఏడాది 2023-24 (విద్యా సంవత్సరం) విద్యార్థుల నమోదుపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఏ రోజుకారోజు షెడ్యూల్ పాఠశాలల నుండి పంపుతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన మార్గదర్శకాలను అన్ని జిల్లా విద్యాధికారులకు పంపించామని,ఈ సారి ఎక్కువ మంది విద్యార్థులను బడిలో చేర్చాలని, చదువుకు దూరమైన, పిల్లలను స్కూల్ లో చేర్చనున్నట్లు ఉపాధ్యాయులు పర్వతాల సతీష్ అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నా బడిబాట కార్యక్రమం.




