మిషన్ భగీరథ పనులను పరిశీలించిన ఇంజనీర్ – ఇన్ -చీప్ కృపాకర్ రెడ్డి
గోపాల్ పేట్ జనం సాక్షి డిసెంబర్ ( 6): మండల కేంద్రంలోని రామన్ పాడు పంపు హౌస్ లో కొనసాగుతున్న మిషన్ భగీరథ పనులను మంగళవారం మిషన్ భగీరథ ఇంజనీర్ – ఇన్ – చీఫ్ కృపాకర్ రెడ్డి పరిశీలించారు ఈ సందర్భంగా పంప్ హౌస్ లోని ఫిల్టర్ హౌస్, బ్యాక్ వాష్ ట్యాంక్, క్లోరిన్ హౌస్, కెమికల్ హౌస్ , లను పరిశీలించి వివిధ దశలలో ఉన్న నిర్మాణ పనులను గురించి తెలుసుకున్నారు వచ్చే ఏడాది జనవరి లోపు పంప్ హౌస్ లోని వివిధ రకాల పనులను పూర్తి చేయాలని అధికారులకు ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో సీఈ చెన్నారెడ్డి, ఎస్ ఈ జగన్మోహన్, ఈ ఈ మేఘరెడ్డి, డి ఈ జైపాల్, ఏఈలు శివరాజు మొగులయ్య, వర్క్ ఇన్స్పెక్టర్లు, తదితరులు పాల్గొన్నారు




