డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతికి ఘన నివాళులు
టేకులపల్లి, డిసెంబర్ 06(జనంసాక్షి)రాజ్యాంగ నిర్మాత విశ్వ విజ్ఞాని భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ వర్ధంతి పురస్కరించుకొని మంగళవారం మండలంలోని సులానగర్ గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి పలువురు టిఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు పూలమాలలు వేసిఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్, ఉపసర్పంచులు అజ్మీర బుజ్జి, ఉండేటి బసవయ్య, వైస్ ఎంపీపీ ఉండేటి ప్రసాద్ మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ అంటరానితనం, కులవివక్షతకు వ్యతిరేకంగా పోరాటం చేసారని కొనియాడారు. ఆర్ధిక అసమానతలను తొలగించేందుకు ఎస్సీ, ఎస్టీ, బి సి లు వెనుకబడిన వర్గాలకు న్యాయం చేసేందుకు రాజ్యాంగంలో హక్కులు కల్పించారని అన్నారు. స్వేచ్ఛ, సమానత్వం కోసం తుదిశ్వాస వరకు ఆయన పనిచేశారని అన్నారు. ప్రతి ఒక్కరూ అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో నాయకులు బల్లెం బిక్షం, పృద్వి, కాంగ్రెస్ నాయకులు రాస మల్ల నరసయ్య, బానోతులక్పతి, గుండా రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.




