Thursday, 5 November 2026

మిషన్ భగీరథ మరమ్మత్తు పనులు వెంటనే చేపట్టండి

 

 

 

 

 

 

 

వరంగల్ ఈస్ట్, ఏప్రిల్ 14 (జనం సాక్షి)నగరంలోని అండర్ రైల్వే గేట్ ప్రాంతం లోని పలు డివిజన్లో మిషన్ భగీరథ పైపులైను లీకేజీల వల్ల త్రాగునీరు సరఫరా సక్రమంగా జరగడం లేదని వచ్చిన ఫిర్యాదులపై తూర్పుఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ స్పందించారు. గురువారం రాత్రి శివనగర్ ప్రజలు బత్తల సత్యం ఆధ్వర్యంలో పలువురు డివిజన్ వాసులు తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ను శివనగర్ లోని క్యాంపు కార్యాలయంలో కలిసి నగరపాలక సంస్థ నుంచి నీరు సక్రమంగా రావడం లేదని తాగునీరు గత 4 నెలల నుండి రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని వినతి పత్రం అందజేశారు వేసవి కాలం నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్నందున శివనగర్ లోని 34 35 డివిజన్లో మిషన్ భగీరథ పనులు పూర్తిచేసి తాగునీరు అందించాలని విజ్ఞప్తి చేయగా స్పందించిన ఎమ్మెల్యే నరేందర్ మరమ్మతులు వెంటనే చేపట్టి తాగునీరు సక్రమంగా అందించాలని ఇంజనీరింగ్ అధికారులను ఆయన ఆదేశించారు. ముఖ్యంగా శివనగర్ లోని పల్లవి ఆసుపత్రి లైన్, పద్మశాలి కళ్యాణ మండపం జంక్షన్, వాసవి లైన్, పద్మావతి ఫర్నిచర్ స్టేషన్ రోడ్ లైన్, మిషన్ భగీరథ నీరు రాకపోవడంతో డివిజన్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పలుమార్లు అధికారులు దృష్టికి సమస్యను తీసుకెళ్లిన స్పందించకపోవడంతో డివిజన్ ప్రజలు సత్యం వెంకటేశ్వర్లు సురేష్ ఎమ్మెల్యే నన్నపని నరేందర్ కు నీటి సమస్యను పరిష్కరించమని వినతి పత్రం అందజేశారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ వారం రోజులలో 34 35 డివిజన్లో ప్రతి ఇంటికి తాగునీరు అందించేందుకు కృషి చేస్తానని డివిజన్ ప్రజలకు ఎమ్మెల్యే హామీ ఇచ్చారు ఎమ్మెల్యేను కలిసిన వారిలో డాక్టర్ ఆనంద్ బోక్రే. డాక్టర్ ఎస్ రవీందర్. వనమాల వెంకటేశ్వర్లు , చిదూరాల వేణు క్రిష్ణమూర్తి మది సురేష్ కుమార్ పుట్ట రవి. బత్తుల సత్యం శ్రీధర్ తదితరులు కలిసారు