Thursday, 5 November 2026

మిషన్ భగీరథ వాటర్ పైప్ పగిలి గంగారం మండల ప్రజలు ఇబ్బందులు

గంగారం మే 20 (జనం సాక్షి)
మండల నికి వచ్చే మిషన్ భగీరథ పైప్ లైన్ తిరుమల గండి, పోలవరం గ్రామాల మధ్యలో కంకర లారీ ఫల్టీ పడడంతో పూర్తిగా పలగడం జరిగినది వెంటనే అధికారులు స్పందించి మరమ్మత్తులకు చర్యలు చేపట్టారు. మిషన్ భగీరథ పైప్ లైన్ పలగడం ద్వారా
గంగారం మండలంలో అన్ని గ్రామాల ప్రజలు మిషన్ భగీరథ వాటర్ పైనే ఆధారపడి జీవిస్తున్నారు. రోజురోజుకు పెరుగుతున్న ఎండల ఉష్ణోగ్రతతో జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు పైప్ లైన్ వెంటనే రిపేర్ చేయాలని వేడుకున్నారు.