Thursday, 5 November 2026

అధికారుల నిర్లక్ష్యానికి యువకుడి బలి

వరంగల్ ఈస్ట్, మే 20 (జనం సాక్షి) మహానగర పాలక సంస్థ అధికారుల నిర్లక్ష్యానికి యువకుడు బలి అయ్యాడని బిజెపి వరంగల్ జిల్లా ఉపాధ్యక్షుడు కనుకుంట్ల రంజిత్ కుమార్ తెలిపారు. వరంగల్ జిల్లా… లేబర్ కాలనీ నుండి ఎనుమాముల వెళ్లే 100 అడుగుల రహదారిపై లైటింగ్ లేకపోవడం వలన మరియు రహదారి మధ్యలో కాంట్రాక్టర్ పైపులను పెట్టడం వల్లనే. 27వ డివిజన్ అబ్బనీ కుంట ప్రాంతానికి చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి గుండా కిరణ్ కుమార్ బలి అయినట్లు చెప్పారు ప్రధాన రహదారిపై ఇష్టానుసారంగా పైపులైను పెట్టిన కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోవాలని మృతుడు గుండా కిరణ్ కుమార్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి రంజిత్ కుమార్ డిమాండ్ చేశారు