Monday, 2 November 2026

మిస్టరీ వీడిన కాటేదాన్‌ కాల్పుల కేసు

హైదరాబాద్‌,మే4(జ‌నంసాక్షి): కలకలం సృష్టించిన హైదరాబాద్‌ పారిశ్రిమిక వాడ  కాటేదాన్‌ కాల్పుల వ్యవహారంలో మిస్టరీ వీడింది. ఉత్తర్‌ ప్రదేశ్‌కు చెందిన ముఠా డబ్బుల దోపిడీ కోసమే ప్రసాద్‌పై నాటు తుపాకీతో కాల్పులు జరిపినట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. స్థానికంగా ఓ బిస్కెట్‌ కంపెనీలో పనిచేస్తున్న రాహుల్‌ అతని ఇద్దరు అనుచరులు నాటు తుపాకీని ఉత్తర్‌ప్రదేశ్‌లో కొనుగోలు చేసినట్టు ప్రాథమికంగా నిర్ధారణ అయింది. నిందితులు తుపాకీతో ఎవరినైనా బెదిరించి దోపిడీకి పాల్పడ్డారా అనే అంశంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఒకటి రెండు రోజుల్లో ఉత్తర్‌ ప్రదేశ్‌కు చెందిన ముఠాను విూడియా ముందు ప్రవేశపెట్టే అవకాశముంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *